ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక మాఫియాకు ఆగడాలు లేకుండా పోతుందని KVPS జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు.శనివారం ASF తహసీల్దార్ కు అక్రమ ఇసుక తరలింపుపై పిర్యాదు చేశామన్నారు. ఇందిరమ్మ ఇంటి పేరుతో ఒక ట్రాక్టర్ అనుమతి తీసుకొని 10 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా జరుగుతున్న జిల్లా మైనింగ్,రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టాలని ASF తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.