అనంతపురం నగరంలోని పాతూరు లో నీలిమ థియేటర్ సమీపంలో ఉన్న కిషోర్ స్టీల్ సామాన్ల అంగడిలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పాము దర్శనమిచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న బ్లూ కోర్ట్ పోలీసులు స్నేక్ క్యాచర్ ను పిలిపించారు. ఒక్కసారిగా పాము దర్శనం ఇవ్వడంతో భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అత్యంత చాకచక్యంగా స్నేక్ క్యాచర్ పామును పట్టుకున్నాడు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు.