కార్వాన్ డివిజన్ పరిధిలోని కనకదుర్గ నగర్ లో కార్పొరేటర్ స్వామి యాదవ్ గురువారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి పళ్ళు చోట్ల రోడ్లపై చెట్ల కొమ్మలు పడ్డాయని వాటిని క్లియర్ చేసేందుకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నామని కొత్తవి ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కార్పొరేటర్ స్వామి యాదవ్ తెలిపారు.