శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ క్రాంతి కుమార్, ఛైర్మన్ తుంగ ఓబులపతి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిలర్లు పలు సమస్యలను లేవనెత్తగా, కౌన్సిలర్ వెంకటరమణమ్మ తమను అధికారులు, సభ్యులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను ఎన్నిసార్లు ప్రస్తావించినా పరిష్కారం లభించలేదని వ్యాఖ్యానించారు.