నేను చంద్రబాబు లాంటోడ్ని.. ఆయన టీడీపీ... నేను జనసేన అంతే తేడా.. మిగతాదంతా సేమ్‌టూ సేమ్." అన్నట్టు జనసేన ఆవిర్భావ సభ తొలిరోజు జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఉన్నట్టుగా కనిపించింది. ఈ ప్రసంగం ద్వారా ఆయన పరోక్షంగా తాను, చంద్రబాబు ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నామని చెప్పకనే చెప్పారుముఖ్యంగా, కొత్తగా ఎన్నికైన జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. "జనసేన ఎమ్మెల్యేల జాతకాలన్నీ నాకు తెలుసు. చంద్రబాబు మాదిరిగా మీకు ర్యాంకులు ఇస్తాను.