అనంతపురం నగరంలో నిర్వహించబోయే సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ అంచనాలకు మించి ఉంటుందని.. మంత్రి కొల్లు రవీంద్ర, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో సూపర్ హిట్ సభకు సంబంధించిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. అలాగే పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలు మాపై నమ్మకంతో 94% మ్యాండేట్ తో గెలిపించారన్నారు. అందుకే ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు.