మంత్రాలయం :శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం ఉదయం వివిధ రకాల రథోత్సవ సేవలు నిర్వహించారు. చంద్రగ్రహణం ఉన్నందున రాత్రి జరపవలసిన రథోత్సవాలు ఉదయం నిర్వహించినట్టు మఠం అధికారులు తెలిపారు. ఉత్సవ మూర్తిని ప్రహ్లాద రాయాలను బంగారు, వెండి, చెక్క రథోత్సలలో ఉంచి పూజలు చేశారు. అశేష భక్త వాహిని నడుమ మేళతాళాలతో ఆలయ ప్రాంగణం చుట్టూ వస్తావని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.