కర్నూలు కొత్త బస్టాండ్ ఎదురుగా ఉల్లి రైతులు రాస్తారోకోకు దిగారు. మార్కెట్లో ప్రభుత్వం ప్రకటించిన ₹1,200 ధరకు కూడా ఉల్లి కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులకు సిపిఎం, ఏపీ రైతు సంఘం మద్దతు తెలిపాయి.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ, సిపిఎం నాయకులు టి.రాముడు మాట్లాడుతూ... "రైతులు వేల క్వింటాళ్ల ఉల్లి పంటను మార్కెట్కు తీసుకువచ్చినా కొనుగోలు నిలిపివేయడం ఘోరం. ప్రకటించిన ₹1,200 ధరతో కోత కూలీలు, రవాణా ఖర్చులకే సరిపోవడం లేదు. కనీసం ₹3,000కు ఉల్లి కొనుగోలు చేయాలి" అని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనపై మార్కెట్ యార్డు క