ఆదిలాబాద్ ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ రెడ్డి ను లంచం తీసుకుంటుండగా శుక్రవారం రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం బాధితుడు సబ్ రిజిస్టర్ ను కలవగా లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని సంప్రదించగా.. పక్క సమాచారంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ ఏసీబీ కోర్టు లో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.