వైఎస్ రాజారెడ్డి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన తల్లి వైయస్ షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతోంది. షర్మిల ఇటీవల కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శనకు తన కుమారుడితో కలిసి వెళ్లి అక్కడే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. రాజారెడ్డి ఇప్పటికే తన తల్లి షర్మిల తో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా వైఎస్ రాజారెడ్డి పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇది ఏపీ రాజకీయాల్లో ఎంతో కీలకమైన పరిణామం.