తిరుపతి జిల్లా గూడూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, రామ మోహన్, సుమన్ రెడ్డి, జేవివి సభ్యులు పాల్గొన్నారు.