ఎస్ కోట మండలం బౌడార లో స్వాతంత్ర ఫలాలు తమకు అందించాలని జిందాల్ నిర్వాసితులు జాతీయ జెండాలతో ఆదివారం మధ్యాహ్నం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తమ భూములు వెంటనే అప్పగించాలని నినాదాలు చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ మాట్లాడుతూ, భూములు తీసుకుని 18 సంవత్సరాలైనా కంపెనీ కట్టని జిందాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. జిందాల్ భూ సేకరణలో ఎటువంటి చట్టాలు అమలు చేయలేదన్నారు.. తీసుకున్న భూమిని వెంటనే భూములు కోల్పోయిన పేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.