నెల్లూరు వేదాయపాళెం సెంటరులో కొలువైన శ్రీ ముక్కోటి దేవతల శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు ఎమ్మెల్యే సోమిరెడ్డికి గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఆత్మీయ సత్కారం చేశారు.