పొదలకూరు మండలం, నేదురుమల్లి గ్రామంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది పర్యటించారు. రైతులు ధాన్యం అమ్ముకున్నాక, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదం అని మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యాన్నికి గిట్టుబాటు ధర లేక, సకాలంలో యూరియా దొరకక అష్ట కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమిరెడ్డికి ఓటు ఎందుకు వేశామా! అని రైతులతో పాటు, అన్ని వర్గాల ప్రజలు తలలు పట్టుకుంటున్నారని బుధవారం సాయంత్రం 5 గంటలకు విమర్శించారు.