కోసిగి:ఫర్టిలైజర్ దుకాణాలు యూరియాను కృత్రిమ కొరత సృష్టించొద్దని ఏవో వరప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కోసిగిలోని ఎరువుల దుకాణాలపై ఏవోతోపాటు ఎక్సైజ్ ఎస్సై కార్తిక్ సాగర్, ఏఎస్సై తిరుపాల్ నాయక్ దాడులు నిర్వహించారు. స్టాక్ గోదాములను, రికార్డులను పరిశీలించారు. ఏవో మాట్లాడుతూ యూరియాను కృత్రిమ కొరత సృష్టించవద్దన్నారు. ఒక రైతుకు రెండు బస్తాల మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు.