సమాజ సేవతోనే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని నంద్యాల జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, సీతారామపురం సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బేతంచెర్ల శేషారెడ్డి సీహెచ్సీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, గోరుమానుకొండ సర్పంచ్ కోడే వెంకటేశ్వర్లు సహకారంతో రోగులకు, గర్భిణీలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సేవలను పలువురు అభినందించారు.