చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం కొమరగుంట పంచాయతీ బందర్ల పల్లెలో గ్రానైట్ క్వారీ అనుమతుల విషయంలో కొద్ది రోజులుగా స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు ఏ నేపథ్యంలో సుమారు 13 మంది స్థానికులపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది కాగా ఆదివారం క్వారీ యజమానులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న ఇరు వర్గాలకు గాయాలయ్యాయి వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి గాయపడిన వారు తిరుపతి ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం ఉద్రేక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.