శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, లావేరు మండలాల పరిధిలో ఆదివారం పోలీసులు కార్డాన్ సెర్చ్ ను నిర్వహించారు. పోలీసులు వీధుల్లోకి రావడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు చెందారు. ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాల నిల్వల కోసం పలు ఇళ్లల్లో స్వాధీనం చేశారు. పలు ద్విచక్ర వాహనాల పత్రాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ నిషేధిత మత్తుపదార్థాలు నిల్వ ఉంచిన రవాణా చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సిబ్బంది హెచ్చరించారు.