జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభ శనివారం నిర్వహించారు.ఈ సమావేశానికి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గౌడలకు 15% రిజర్వేషన్స్ కల్పిస్తూ తెచ్చిన మద్యం పాలసీ వల్ల గీత కార్మికులకు ఏమి ప్రయోజనం లేదనీ,సొసైటీ TFT గ్రామాలకు ఇవ్వాలనీ,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని,ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇవ్వవలసిన పెండింగులో ఉన్న ఎక్సిగ్రేషన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.