సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణఖేడ్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం సబ్ డివిజన్ అధికారులకు వినతిపత్రం అందించామని తెలిపారు. డివిజన్ పరిధిలో రోడ్లు అద్వాన్నంగా మారాయని ఆరోపించారు.