యాకుద్ పురాలో పౌరసరఫరాల శాఖ అధికారులతో నియోజకవర్గంలోని పెండింగ్ రేషన్ కార్డులపై సోమవారం మధ్యాహ్నం సమావేశాన్ని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 6,500 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని త్వరగా పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేసి నూతన రేషన్ కార్డులు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రేషన్ బియ్యం రాకపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.