ములకలచెరువు మండలం బూడిదగడ్డిపల్లిలోని పురాతన శివాలయం వద్ద వివాదం చెలరేగింది. ఆలయ పూజారి గుడికి తాళం వేసి, దేవుని భూమిని ఆక్రమించి ఎవ్వరినీ రానివ్వడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆలయానికి దీప, ధూప, నైవేద్యాలు అందకపోవడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన గ్రామస్థులను పరుష పదజాలంతో తిట్టడం వల్ల వాతావరణం మరింత ఉద్రిక్తమైంది.