విజయవాడ ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలోని ఓ యువతీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఎంబీఏ పూర్తి చేసిన తనకు ఉద్యోగం రాలేదని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలు దేవి శెట్టి నవ్య గా పోలీసులు గుర్తించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.