విజయవాడలో బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటన సంచలనం రేపింది. బుధవారం తెల్లవారుజామున విజయవాడ డాబాకోర్టులో సెంటర్ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నాయకు అక్రమ సంబంధం ఉన్న మహిళ ఆ ప్రాంతానికి చేరుకొని గొడవాడుకుంటున్న నేపథ్యంలో బీట్ కానిస్టేబుల్ వచ్చి గొడవను సర్ది చెప్పే సమయంలో సదరు మహిళ బిట్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడింది ఈ ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కు సమాచారం అందించడంతో ఆ బుధవారం ఇరు కానిస్టేబుల్ పై చర్యలు తీసుకునే విధంగా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.