వర్ని మండలం పాత వర్ని లో విద్యుత్ షాక్ కు గురైన బాలుడు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు గ్రామంలోని వీరభద్ర ఆలయం నుండి ఇంటికి వెళ్తున్న గడ్డం నరేష్ ఏడు సంవత్సరాల బాలుడు విద్యుత్ స్తంభానికి సపోర్టుగా ఉన్న వైరును పట్టుకోవడంతో షాక్ తగిలింది. సపోర్ట్ వైర్ కు విద్యుత్ సరఫరా అయి బాలుడికి షాక్ తగిలింది. అటుగా వెళుతున్న ప్రజలు గమనించి కర్రతో కొట్టి బాలుడిని ప్రమాదం నుండి రక్షించారు. గాయలపాలైన నరేష్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.