నాంపల్లి లోని మీడియా అకాడమీ భవనంలో జర్నలిజం వృత్తిలో అమరులైన జర్నలిస్టుల కుటుంబాలకు మంత్రి సీతక్క సోమవారం మధ్యాహ్నం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని తెలిపారు. యాజమాన్యాలు వ్యతిరేకించిన రిపోర్టర్లు వెనక్కి తగ్గలేదని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి వారధిగా పనిచేశారని ఆమె తెలిపారు. సమస్యలు పరిష్కరించడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని తెలిపారు.