APK ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసులు మాట్లాడుతూ వాట్సాప్ లో సైబర్ నేరగాలు ఏపీకే ఫైల్స్ పంపి క్లిక్ చేయగానే మోసం చేస్తున్నారని అన్నారు. ఎప్పుడూ ఏపీకే ఫైల్స్ ను క్లిక్ చేయవద్దని ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని రాచకొండ పోలీసులు తెలిపారు.