నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. ఈ సందర్భంగా ఓ రైతు తమ ఆవేదనను వ్యక్తం చేశాడు యూరియా కొరత తీవ్రంగా ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని ప్రస్తుతం రోజున తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది అని రైతులు తెలిపారు. ఈ పరిస్థితికి కేంద్రం తప్ప రాష్ట్రం తప్ప తమకు అర్థం కావడం లేదని ఆ రైతు తమ ఆవేదనను తెలిపాడు.