పొదలకూరు మండలం కనపర్తి వనంతోపు రోడ్డులో ఆదివారం ప్రమాదం జరిగింది. గాలిపాలెం నుంచి కర్తమ్మలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ నీ.. పొదలకూరు వైపు నుంచి వస్తున్న స్కూటర్ ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డు పక్కనున్న ముళ్ళ పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటంలో స్కూటర్పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు