కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారంలో ఉన్న శ్రీపాద అనఘా దత్త క్షేత్రంలో ఉత్తరధికారి దత్త విజయానంద స్వామీజీ చాతుర్మాస మహోత్సవం ఘనంగా ముగిసింది. చివరి రోజు శనివారం విజయానంద స్వామీజీ భక్తుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అనఘా దత్త క్షేత్రం కమిటీ సభ్యులను సేవకులను విజయనంద స్వామీజీ ఘనంగా సన్మానించారు. చాతుర్మాస వ్రత దీక్ష అత్యంత వైభవంగా జరిగాయి.