షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధి శ్రీ సాయి బాలాజీ టౌన్ షిప్ లో వీధి కుక్కలు బాలికపై దాడికి పాల్పడ్డాయి. దీంతో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. వేసవికాలం ఉండడంతో పిల్లలు ఆడుకుంటూ ఉంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుండి కాపాడాలని కోరుతున్నారు.