ఈ నెల 30న పల్లె ఉమా వర్ధంతి వేడుకలను అనంతపురంలోని పల్లె రఘునాథ్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. పల్లె ఉమా బాలాజీ విద్యా సంస్థలు సంస్థలు స్థాపించి ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.