పూతలపట్టు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు సివిల్ జెడ్జ్ భారతి ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమెన మాట్లాడుతూ బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. అదేవిధంగా బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఆమె సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సిఐ కృష్ణమోహన్ మండల అధికారులు పాల్గొన్నారు