తమ క్లస్టర్ కి పర్మినెంట్ వ్యవసాయ విస్తరణ అధికారి ని నియమించాలని నిర్మల్ జిల్లా కుబీర్ మండల క్లస్టర్ రైతులు జిల్లా వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏ ఈ ఓ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాపోయారు.సకాలంలో ఉన్న పంటను నమోదు చేయక పంట విక్రయ సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుబీర్ క్లస్టర్ లో ఉన్న అధికారి డిప్టేషన్ పై వెళ్లడంతో పంట నమోదు ఆలస్యం అవుతుందని పర్మినెంట్గా కుబీర్ క్లస్టర్ కు వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించాలని కోరారు.