మంగళవారంమధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ 1వ వార్డు తిమ్మాపురం గ్రామంఎస్సీ కాలనీలో సుమారుగా 60 కుటుంబాలకు పైగా గత 10 సంవత్సరాల నుంచి కేవలం ఒక్క నీటి కొళాయి తో నివసిస్తూ ఉన్నారు. ఎన్ని సార్లు మున్సిపల్ కమిషనర్ కి స్ధానిక నాయుకులకు ఫిర్యాదు తెలియజేసిన ఆ సమస్య మాత్రం కేవలం చెత్త బుట్టకు మాత్రమే పరిమితి అయ్యాయని స్థానికులు తెలిపారు.కలెక్టర్ గ్రీవెన్స్ వారికి ఎన్ని మార్లు చెప్పిన సరే సమస్య పరిష్కారం కాలేదని తెలియజేశారు. అధికారులు సమస్యను తూతూమంత్రంగా పర్యవేక్షించి వెళ్ళిపోతున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.