చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు...కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన పాల్గొన్నారు...ఈ సందర్బంగా ఎంపీ ఉద్యోగాల కోసం వచ్చిన యువతీ యువకులతో మాట్లాడి చదువు, ఉద్యోగాల ప్రాముఖ్యతను తెలియజేసారు...అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు బాబు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారన్నారు... జాబ్ మేళాలను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చ