శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు సీఐ అకారణంగా నాపై కేసుల నమోదు చేసి జైలుకు పంపించాడని ఆయన వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కొత్తచెరువు మండలం, కమ్మవారిపల్లి చెందిన భాస్కర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గ్రామానికి చెందిన ఆదికేశవ కుమారుడు భాస్కర్ ఆదివారం రాత్రి కొత్తచెరువు సీఐ రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని తనను వేధిస్తున్నాడని సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.