తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉండగా పనిచేసిన కార్యకర్తలకు పార్టీ జిల్లా కమిటీలో ప్రాధాన్యత కల్పించడమే కాకుండా వివిధ నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రులు టీజీ భరత్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టిడిపి హిందూపురం పార్లమెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు టీజీ భరత్ సవిత మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు పరిటాల సునీత తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ పార్టీ కష్ట కాలంలో ఉండగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు