Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 30, 2025
సీఎం సహాయనిధి అనారోగ్య బాధితులకు నిజమైన వరం అని ఉదయగిరి MLA కాకర్ల సురేష్ పేర్కొన్నారు. మంగళవారం వింజమూరులోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన 122 మంది బాధితులకు ఆయన నిధులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటి 1 లక్ష 75 వేల రూపాయల విలువైన చెక్కులను నాయకుల సమక్షంలో బాధితులకు అందజేశారు.ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ, ఇప్పటివరకు తమ నియోజకవర్గంలో నాలుగు కోట్లకు పైగా సీఎం సహాయనిధి చెక్కులు అందజేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీఎస్టీ 2.0 తగ్గింపుపై హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ తగ్గించడం వల్ల Ap కి సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల అదనపు