ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు లో అంతర్జాతీయ నిపుణుల బృందం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పర్యటించింది..అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో కలసి పోలవరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించారు జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.