కలికిరిలో వినాయక నిమజ్జన ప్రాంతాలను సీఐ ఎస్.అనిల్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.వినాయక చవితిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు అనంతరం మూడవ రోజు అయిన శుక్రవారం కలికిరిలో వినాయక విగ్రహాలను నిమజ్జన కార్యక్రమాలను చేపడున్నారు. ఇందులో భాగంగా కలికిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ ఎస్.అనిల్ కుమార్, ట్రాన్స్ కో ఏఈ ముజిబుర్ రెహమాన్, కలికిరి గ్రామపంచాయతీ ఈవో జి.అశోక్, కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డి వారి యోగేష్ రెడ్డి, సర్పంచ్ యల్లయ్య నిమజ్జన ప్రాంతాలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో నిమజ్జనాల కొరకు తీసుకువచ్చే విగ్రహాలకు దారి సౌకర్యం కల్పించారు