Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
ప్రతి ఇంటి నుంచి వారానికి రెండు సార్లు తడి, పొడి చెత్తను సేకరించాలని అనంతసాగరం ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రీన్ అంబాసిడర్లకు సూచనలు చేస్తూ ప్రతి ఇంటి నుంచి రెండుసార్లు చెత్తను సేకరించి చెత్తతో సంపద తయారీ కేంద్రాలకు తరలించి ఎరువుల తయారీ కోసం ఉపయోగించాలని సూచించారు.