ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చిన్యాతండ గ్రామం లో విషాదం నెలకొంది.పాము కాటుకు గురై మాళోత్ దేవిజా(43) అనే వ్యవసాయ కూలీ మృతి చెందాడు. తన వరిపోలంలో మందు చల్లుతుండగా దేవిజ పాము కాటుకు గురయ్యాడు.అయితే ఆది గమనించకుండా అలానే మందు చల్లి పని ముగించుకొని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.గమనించిన స్థానికులు కల్లూరు హాస్పిటల్ కు తరలించారు.దేవిజ ను పరీక్షించిన వైద్యులు పాము కాటు కు గురైనాడని నిర్దారించి ప్రధమ చికిత్స అందించారు.పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.దేవిజ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.