కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల మండలం పెద్దనపాడు గ్రామంలో బుధవారం జమ్మలమడుగు నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌజన్యంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ మినరల్ వాటర్ ప్లాంట్ పల్లె ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు.ఇలాంటి ప్లాంట్లు ప్రజలకు మంచినీటి వనరులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.అనంతరం ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కొత్త బాలగంగిరెడ్డి ను భూపేష్ పరామర్శించారు.