శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఉదయం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం తన భర్త వెంకన్న చౌదరి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.