జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ జిల్లాలో బీడీ కార్మికులకు పిఎఫ్ నాన్ పిఎఫ్ తదితర వాటికి సంబంధించి సమస్యలు పరిష్కారం కాలేదని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు కాలేదని వాటిని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.