కడప జిల్లా రాజుపాలెం మండల రెవెన్యూ అధికారిగా మనోహర్ రెడ్డిని జిల్లా కలెక్టర్ శ్రీధర్ నియమించారు. నిన్నటి వరకు ప్రొద్దుటూరు ఎమ్మార్వో గంగయ్య రాజుపాలెం ఎమ్మార్వోగా ఇన్ఛార్జ్ గా ఉన్నారు.మనోహర్ రెడ్డి గురువారం ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టారు. ఆర్ఐ లు, విర్ఓలు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండలంలోని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆయన స్వగ్రామం కామనూరులో గురువారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు.