సోలార్ పవర్ ప్రజలకి వరం లాంటిదని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజీవ్ నగర్లో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకంపై మహిళలకు అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీని ప్రజలు వినియోగించుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోలార్ పవర్ ద్వారా నెలకి 400 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు.