ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం నుంచి భీమడోలు వ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటడాయి. స్థానిక పార్వతి సమేత భీమేశ్వరస్వామి ఆలయాన్ని సంప్రోక్షణ విశేషపూజలు అనంతరం ఉదయం ఐదు గంటలకు భక్తుల దర్శనానికి అనుమతించినట్లు అర్చుకులు కాళ్ళకూరి సాంబశివశర్మ తెలిపారు. ఈ సందర్బంగా భక్తులు విశేష అభిషేకాలు, పూజలను చేసారు. ఈ సందర్బంగా ఆలయ ఆవరణలో పలువురు భక్తులు బ్రాహ్మణులకు దానాలు సమర్పించారు.