సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డీ గ్రామంలో ఆయిల్ ఫాం సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అవినాష్ వర్మ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు 90 శాతం సబ్సిడీతో మొక్కలు అందిస్తుందన్నారు. డ్రిప్ పరికరాలు సబ్సిడీ ద్వారా ఇవ్వడంతోపాటు మూడు సంవత్సరాల వరకు ఏడాదికి ఎకరానికి 4000 రూపాయల మెయింటెనెన్స్ అందిస్తుందన్నారు. అవకాశాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గోద్రెజ్ ప్రతినిధులు. వ్యవసాయ శాఖ అధికారులు. రైతులు పాల్గొన్నారు